జగన్ యువతను మోసం చేశాడు: నారా లోకేశ్
- అజీస్ పురం వద్ద 2100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న యువగళం
- శిలాఫలకం ఆవిష్కరించిన లోకేశ్
- పెద్దఅలవలపాడు క్యాంప్ సైట్‌లో వలస కార్మికులతో సమావేశం
- స్థానిక సమస్యలు పరిష్కరించి వలసలకు అడ్డుకట్ట వేస్తానని యువనేత హామీ
కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అద్భుత స్పందన వచ్చింది. స్థానికులు యువనేతకు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. నియోజకవర్గంలోని అజీస్ పురం వద్ద బుధవారం(159 రోజు) ‘యువగళం’ 2100 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పెద్దఅలవలపాడు నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర రామాపురం, గుడారివారిపాలెం, అజీస్ పురం మీదుగా కనిగిరి శివారు శంకవరం క్యాంప్ సైట్‌కు చేరింది.
పాదయాత్రలో భాగంగా పెద్దఅలవలపాడు క్యాంప్ సైట్‌లో వలస కార్మికులతో సమావేశమైన యువనేత లోకేశ్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ కనిగిరిలో వలసలు ఆపడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. సాగు, తాగు నీరు అందించి వలసలకు చెక్ పెడతామని హామీ ఇచ్చారు.
లోకేశ్ ప్రసంగంలో ముఖ్యాంశాలు..
‘‘ వలసలను నివారించడమే లక్ష్యం!
కనిగిరిని సస్యశ్యామలం చేసి, వలసలను నివారించడమే నా లక్ష్యం. కనిగిరి నియోజకవర్గంలో వలసలు ఎక్కువ. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కనిగిరి వాళ్లు ఉంటారు. ఫ్లోరైడ్ సమస్య వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తాం. వలసలకు అడ్డుకట్ట వేస్తాం.
వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తాం
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తాం. ప్రకాశం జిల్లాకు పరిశ్రమలు, తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఇప్పుడు జగన్ అన్ని కార్యక్రమాలు రద్దు చేశాడు. అధికారంలోకి వచ్చాక యువతను వ్యవసాయం వైపు ప్రోత్సహించే విధంగా కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తాం.
ప్రతిఏటా జాబ్ నోటిపికేషన్ ఇస్తాం
జగన్ యువతకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 6,500 కానిస్టేబుల్ పోస్టులు, డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి మాటతప్పాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తాం.
పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలుచేస్తాం
విద్యా దీవెన, వసతి దీవెన చెత్త పథకాలు. ఈ కొత్త విధానం వలన తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఫీజులు చెల్లించక కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ టైం సెటిల్మెంట్ చేసి సర్టిఫికేట్లు ఇప్పిస్తాం. పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తాం’’ అని లోకేశ్ హామీ ఇచ్చారు.
యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు
160 వరోజు (20-7-2023) యువగళం పాదయాత్ర వివరాలు
కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం (ప్రకాశం జిల్లా)
4.00 – కనిగిరి శివారు శంకవరం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం
5.30 – కనిగిరి శివారు శంకవరంలో స్థానికులతో సమావేశం
5.45 – కనిగిరి పామూరు బస్టాండులో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం
7.00 – కనిగిరి ఒంగోలు బస్టాండులో స్థానికులతో సమావేశం
7.15 – కనిగిరి చెక్ పోస్టు వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం
7.45 – కనిగిరి టకారిపాలెంలో డైలీవేజ్ వర్కర్లతో సమావేశం
8.00 – కనిగిరి దేవాంగనగర్‌లో స్థానికులతో సమావేశం
8.10 – కనిగిరి కాశిరెడ్డి నగర్ ఎస్టీ సామాజికవర్గీయులతో సమావేశం
9.25 – చల్లగరిగలలో స్థానికులతో సమావేశం
10.40 – నందనమారెళ్లలో స్థానికులతో సమావేశం
11.25 – ఎర్రఓబునపల్లి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం
11.40 – ఎర్రఓబునపల్లి క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస

- ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2105.9 కి.మీ.
- ఈరోజు నడిచిన దూరం 13.0 కి.మీ.