తల్లిదండ్రుల మందలింపు.. జలపాతంలో దూకి బాలిక ఆత్మహత్యాయత్నం!

  • చత్తీస్‌ఘడ్‌లోని చిత్రకోట్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • అదృష్టవశాత్తూ బాలికకు తప్పిన ప్రాణాపాయం
  • నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో
సెల్‌ఫోన్ వినియోగం చిన్నారులపై ఎంతటి ప్రతికూల ప్రభావం చూపిస్తోందో చెప్పే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ ఎక్కువగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఓ బాలిక ఏకంగా జలపాతం నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ జిల్లాలో మంగళవారం చిత్రకోట్ జలపాతం వద్ద ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

తల్లిదండ్రులు మందలించడంతో హుటాహుటిన జలపాతం వద్దకు వెళ్లిన బాలిక కాసేపు అటూ ఇటూ చూసి జలపాతం నుంచి దూకేసింది. అక్కడున్న పర్యాటకులు వారిస్తున్నా వినకుండా ఆత్మహత్యాయత్నానికి పూనుకుంది. అయితే, అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.


More Telugu News