గద్వాలలో బీఆర్ఎస్‌కు షాక్, పార్టీకి జెడ్పీ చైర్‌పర్సన్ సరిత రాజీనామా

  • రేపు ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న సరిత దంపతులు
  • కొన్ని రోజులుగా స్థానిక ఎమ్మెల్యేతో విభేదాలు
  • జూపల్లి కృష్ణారావు చర్చలు జరపడంతో కాంగ్రెస్‌లోకి రాక
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గట్టి షాక్ తగిలింది. గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్ సరిత పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధిష్ఠానానికి ఫ్యాక్స్ ద్వారా పంపించినట్టు సరిత వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఆమె కాంగ్రెస్ లో చేరనున్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్నిరోజులుగా ఎమ్మెల్యేకు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా సరిత అధికార పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు... సరిత దంపతులతో చర్చలు జరిపి, కాంగ్రెస్ లోకి తీసుకువస్తున్నారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రేపు కొల్లాపూర్ లో నిర్వహించాల్సిన సభలో ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సభను 30వ తేదీకి వాయిదా వేశారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న తేదీ రేపు కావడంతో అదే రోజు సరిత దంపతులు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ లో చేరనున్నారు.


More Telugu News