కూటమికి I-N-D-I-A పేరు వినియోగంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

  • I-N-D-I-A పేరును అక్రమంగా ఉపయోగించారని పోలీస్ కేసు
  • పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బరాఖంబ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • ఎంబ్లమ్ యాక్ట్ ఉల్లంఘన కిందకు వస్తుందన్న ఫిర్యాదుదారు
  • వ్యక్తిగత ప్రయోజనాల కోసం I-N-D-I-A పేరు వినియోగించవద్దన్న ఫిర్యాదుదారు
26 పార్టీలతో కూడిన ప్రతిపక్షాల ఫ్రంట్... భారత్ (I-N-D-I-A) పేరును అక్రమంగా ఉపయోగించిందన్న ఆరోపణలతో పోలీస్ కేసు నమోదయింది. రెండు రోజుల పాటు బెంగళూరులో సమావేశమైన విపక్షాలు తమ కూటమికి I-N-D-I-A  (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే I-N-D-I-A పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని బరాఖంబ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ పేరును వినియోగించడం ఎంబ్లమ్ యాక్ట్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం భారతదేశం (I-N-D-I-A) పేరును తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరూ ఉపయోగించుకోలేరని పేర్కొన్నారు. ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. ఈ పేరును పెట్టుకోవడం ద్వారా 26 రాజకీయ పార్టీలు దేశం పేరును దుర్వినియోగం చేశాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.


More Telugu News