పబ్లిసిటీ లేకుండానే థియేటర్స్ కి వస్తున్న కాజల్ 'కార్తీక'

  • కాజల్ తమిళ చిత్రంగా 'కరుంగాపియం'
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • తెలుగులో 'కార్తీక' టైటిల్ తో వస్తున్న సినిమా 
  • ఈ నెల 21వ తేదీన రిలీజ్ 
  • కీలకమైన పాత్రలో రెజీనా
కాజల్ ప్రధాన పాత్రధారిగా తమిళంలో 'కరుంగాపియం' సినిమా రూపొందింది. హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ ఇది. ఈ సినిమాను అద్దె ప్రాతిపదికన కొన్ని రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ లో వదిలారు. శ్రీ వెంకటసాయి ఫిలిమ్స్ వారు ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. 'కార్తీక' పేరుతో ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఆ మధ్య చెప్పారు. 

అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ కి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. ఈ సినిమా గురించిన విషయం కూడా ఎవరికీ గుర్తులేదు. ఈ నెల 21వ తేదీనే ఈ సినిమా థియేటర్లకు రానుందని తాజాగా ప్రకటించారు. రిలీజ్ డేట్ చాలా దగ్గరికి వస్తున్నా, పబ్లిసిటీ గురించి పెద్దగా పట్టించుకోకుండా ఒక్కసారిగా థియేటర్లలో వదులుతున్నారు. 

సోషల్ మీడియాలో కూడా పెద్దగా హడావిడి లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కాజల్ కూడా ఈ సినిమాను గురించి ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడం మరింత ఆశ్చర్యం. ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, రెజీనా .. జనని .. రైజా విల్సన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ భయపెడుతుందనేది చూడాలి మరి. 


More Telugu News