రేపు ప్రతిపక్ష కూటమి తొలి భేటీ!

  • మల్లికార్జున్‌ ఖర్గే ఛాంబర్‌లో జరగనున్న సమావేశం
  • పార్లమెంట్‌లో చేపట్టాల్సిన అంశాలపై చర్చించేందుకు సమావేశం
  • జులై 20 నుండి ఆగస్ట్11 వరకు పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రతిపక్ష కూటమి (I-N-D-I-A) భారత తొలి సమావేశం గురువారం జరగనుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున్‌ ఖర్గే ఛాంబర్‌లో ఈ సమావేశం జరగనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మొదటి రోజు నుండి పార్లమెంట్‌లో చేపట్టాల్సిన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20వ తేదీన ప్రారంభమై ఆగస్ట్ 11న ముగుస్తాయి.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాలపై సమన్వయంతో వ్యవహరించాలని బెంగళూరులో జరిగిన సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. 26 పార్టీల I-N-D-I-A కి లోక్ సభలో 150 మంది ఎంపీల మద్దతు ఉండగా, ఎన్డీయేకు 330 మంది ఎంపీల మద్దతు ఉంది.


More Telugu News