మరో రెండుమూడు రోజులు భారీ వర్షాలు, అధికారులకు కేటీఆర్ ఆదేశాలు

  • భారీ వర్షం నేపథ్యంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు
  • అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచన
  • లోతట్టు ప్రాంతాల్లో డీవాటరింగ్ పంపులు ఏర్పాటు చేశామన్న అధికారులు
హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని, ఇందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లోను నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.

 భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నానక్‌రామ్‌గూడలోని కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసు వంటి విభాగాలు నిత్యం సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వరదల్లో ప్రాణనష్టం కూడదని ఆదేశించారు.

జీహెచ్ఎంసీ వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను కూడా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు కేటీఆర్ కు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో డీవాటరింగ్ పంపులు ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు.


More Telugu News