బోటు నడిపేవాడిగా చైతూ .. అతని లవర్ గా కీర్తి సురేశ్!

  • 'భోళాశంకర్'తో పలకరించనున్న కీర్తి సురేశ్
  • గీతా ఆర్ట్స్ లో సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ 
  • దర్శకత్వం వహించనున్న చందూ మొండేటి 
  • 'తెరి' హిందీ రీమేక్ లోనూ ఛాన్స్? 
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ ఉంది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'భోళాశంకర్' ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 'వేదాళం' రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో ఆమె చిరంజీవికి చెల్లెలిగా కనిపించనుంది. కథ అంతా కూడా ఆమె పాత్ర ప్రధానంగానే కొనసాగుతుంది. 

ఈ నేపథ్యంలో తెలుగులో కీర్తి సురేశ్ మరో ప్రాజెక్టును అంగీకరించిందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ వారు నాగచైతన్య హీరోగా ఒక సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' హిట్ కాగా, 'సవ్యసాచి' పరాజయం పాలైంది. 

ఇప్పుడు మూడో ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. సూరత్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. బోట్ డ్రైవర్ గా చైతూ .. అతనిని ప్రేమించే యువతిగా కీర్తి సురేశ్ కనిపించనుందని చెబుతున్నారు. ఇక హిందీలో వరుణ్ ధావన్ హీరోగా రూపొందనున్న 'తెరి' రీమేక్ లోను కీర్తి సురేశ్ ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది.



More Telugu News