టీడీపీ, బీజేపీ మధ్య పవన్ కల్యాణ్ మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు: సీపీఐ నారాయణ

  • ఎన్డీయేతో పవన్ చేతులు కలపడంపై నారాయణ విమర్శలు
  • చేగువేరా నుంచి సావర్కర్ వైపు ప్రయాణం చేస్తున్నారని విమర్శలు
  • మితవాదం వైపు పవన్ ప్రయాణిస్తున్నారని వ్యాఖ్య
ఎన్డీయేతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లడం బాధను కలిగిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చేగువేరా నుంచి సావర్కర్ వైపు పవన్ కల్యాణ్ ప్రయాణం చేస్తున్నారని విమర్శించారు. అతివాద పోరాట యోధుడు చేగువేరా నుంచి మితవాది అయిన సావర్కర్ వైపు రావడం ఏమిటని ప్రశ్నించారు. ఈరోజు బీజేపీ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, రాజకీయ నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ, టీడీపీ మధ్య పవన్ మధ్యవర్తిత్వం చేయడం కూడా మంచిది కాదని అన్నారు. పవన్ ఇప్పటి వరకు చేసిన రాజకీయాలకు, ఇప్పుడు చేస్తున్న రాజకీయాలకు తేడా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పచ్చి మితవాదం వైపు పవన్ ప్రయాణిస్తుండటం దురదృష్టకరమని అన్నారు.


More Telugu News