ధోని, సాక్షి నిర్మాతలుగా రూపొందుతోన్న ఎల్‌జీఎం (LGM - Lets Get Married) తెలుగు ట్రైలర్ విడుదల
- నిర్మాతగా మారిన ధోనీ
- భార్యతో కలిసి ఎల్ జీఎం చిత్ర నిర్మాణం
- రమేశ్ తమిళ్ మణి దర్శకత్వంలో చిత్రం
- నూతన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఎల్ జీఎం
భారత క్రికెట్ చరిత్రలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ధోనీ తన భార్య సాక్షితో కలిసి ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై LGM సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించటంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మిస్తున్నారు.
త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం నేడు రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు మన సినిమాల్లో రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో LGM తెరకెక్కుతుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక సినిమాలో హీరో హరీశ్ కళ్యాణ్, హీరోయిన్ ఇవానాతో పాటు హీరో తల్లిగా నటించిన నదియా చాలా కీలక పాత్రలో అలరించారు.
ఈ చిత్రానికి రమేశ్ తమిళ్ మణి దర్శకుడు. ఆయన మాట్లాడుతూ, వైవిధ్యమైన చిత్రాలను ఆదరించటంతో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. కుటుంబం ఎలా ఉండాలి... పరిస్థితులను ఎలా అవగాహన చేసుకోవాలి... ఎలా సర్దుకు పోవాలనే విషయాలను కామెడీ కోణంలో చూపిస్తూనే మంచి ఎమోషనల్ టచ్‌తో సినిమాను రూపొందించామని తెలిపారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం అని వెల్లడించారు.
ధోనీ కూడా ఎల్ జీఎం సినిమాపై స్పందించారు. ‘‘నేను సినిమా చూశాను. చాలా క్లీన్ మూవీ. చక్కటి ఎంటర్‌టైనర్. నేను నా కుమార్తెతో కలిసి ఎల్‌జీఎం సినిమా చూస్తాను. తను నన్ను చాలా ప్రశ్నలు వేస్తుంది. అయినప్పటికీ నేను తనతోనే సినిమా చూస్తాను. నటీనటులు, టెక్నీషియన్స్ అద్భుతంగా వర్క్ చేశారు. చాలా మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాను నేను నిర్మించినందుకు గర్వంగా ఉంది. డైరెక్టర్ రమేష్ తమిళ్ మణి ఓ ఆర్కిటెక్ట్ కూడా" అని వివరించారు.
"నా భార్య సినిమా చేయాలని నాతో చెప్పినప్పుడు నేను తనతో ఒకే మాట చెప్పాను. అదేంటంటే... సినిమా చేయటం అంటే ఓ ఇంటిని డిజైన్ చేసినట్లు కాదని. నువ్వు ఓ కథను ఫిక్స్ చేసుకుని, నటీనటులను కూడా ఎంపిక చేసుకో. నువ్వు ఒక్కసారి ఓకే అన్న తర్వాత సినిమా చేస్తానని అన్నాను. అలా ఈ సినిమాను స్టార్ట్ చేశాం. మంచి టీమ్ కారణంగానే తక్కువ సమయంలోనే సినిమాను కంప్లీట్ చేశాం. సినిమా యూనిట్‌కు మంచి ఫుడ్ ఉండేలా చూసుకోమని చెప్పాను.
నేను విధిని నమ్ముతాను. నా టెస్ట్ కెరీర్ చెన్నైలోనే ప్రారంభమైంది. క్రికెట్ విషయానికి వస్తే హయ్యస్ట్ టెస్ట్ స్కోర్ కూడా చెన్నైలోనే సాధించాను. ఇలా చెన్నైతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడ ప్రజల ప్రేమాభిమానాలు చాలా గొప్పగా ఉంటాయి.
ఇక ఎల్‌జీఎం సినిమా విషయానికి వస్తే త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం. చాలా ఎంజాయ్ చేస్తారు. అత్త, కోడలు... వారి మధ్యలో ఇబ్బంది పడే కొడుకు ఇలా ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన సినిమా ఇది’’ అని ధోనీ వివరించారు.
ధోనీ అర్ధాంగి సాక్షి మాట్లాడుతూ, LGM సినిమా గురించి చెప్పాలంటే మన చుట్టూ చాలా మంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటారని వివరించారు. ఇలాంటి పాయింట్ మీద సినిమా ఎందుకు చేయకూడదనిపించిందని, అప్పుడు దర్శకుడు రమేష్‌తో మాట్లాడి సినిమాను స్టార్ట్ చేశామని వెల్లడించారు. "ఈ సినిమా తమిళంలోనే చేయటానికి కారణం ధోనీయే. చెన్నైతో మాకున్న అనుబంధం కారణంగా మా తొలి సినిమాను ఇక్కడే చేశాం’’ అని స్పష్టం చేశారు.