ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్ ఇదే!

  • సింగపూర్ పాస్ పోర్టు పవర్ ఫుల్ అంటున్న హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్
  • సింగపూర్ పాస్ పోర్టుతో 193 దేశాల్లో వీసా లేకుండా పర్యటన
  • హెన్లీ ఇండెక్స్ లో ఐదేళ్లుగా నెంబర్ వన్ గా ఉన్న జపాన్
  • ఈసారి జపాన్ కు మూడో స్థానం
వీసా... ఒక దేశం నుంచి మరో దేశంలోకి అడుగుపెట్టాలంటే ఈ అనుమతి పత్రం తప్పనిసరి. అయితే, కొన్ని దేశాల పాస్ పోర్టులు చాలు... వీసాలతో పనిలేకుండా అనేక దేశాలు చుట్టిరావొచ్చు. తాజాగా హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ సంస్థ ప్రపంచ శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితా వెల్లడించింది. 

ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలో 227 దేశాలు ఉండగా, ఒక్క సింగపూర్ పాస్ పోర్టుతో 193 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించవచ్చట. గత ఐదేళ్లుగా శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో జపాన్ నెంబర్ వన్ గా కొనసాగింది. అయితే 2023లో ఆ స్థానాన్ని సింగపూర్ ఆక్రమించింది. హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ లో జపాన్ మూడో స్థానానికి పడిపోయింది. 

ఇక, రెండో స్థానంలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ ఉన్నాయి. ఈ యూరప్ దేశాల పాస్ పోర్టు ఉంటే 190 దేశాల్లో అడుగుపెట్టేందుకు అనుమతి లభిస్తుంది. జపాన్ తో పాటు దక్షిణ కొరియా, ఫిన్లాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, లక్జెంబర్గ్, స్వీడన్ దేశాలు కూడా మూడో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్ పోర్టు కలిగివున్న వారిని 189 దేశాలు వీసా లేకపోయినా అనుమతిస్తున్నాయి. ఈ జాబితాలో బ్రిటన్ కు నాలుగో స్థానం లభించింది. 

హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ జాబితాను ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా రూపొందించారు.


More Telugu News