సోనియా, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం భోపాల్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- బెంగళూరులో విపక్ష పార్టీల సమావేశానికి హాజరైన కాంగ్రెస్ అగ్రనేతలు
- బెంగళూరు నుండి ఢిల్లీకి విమానంలో ప్రయాణం
- ప్రతికూల వాతావరణం నేపథ్యంలో భోపాల్ లో అత్యవసర ల్యాండింగ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆమె తల్లి సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం అత్యవసరంగా భోపాల్ లో ల్యాండ్ అయింది. ప్రతిపక్షాల సమావేశానికి హాజరయ్యేందుకు వారు బెంగళూరుకు వచ్చారు. ఈ సమావేశం అనంతరం తిరిగి బెంగళూరు నుండి ఢిల్లీకి బయలుదేరారు. అయితే వాతావరణం ప్రతికూలంగా మారడంతో భోపాల్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
26 ప్రతిపక్షపార్టీల మేధోమథనం బెంగళూరులో జరిగింది. విపక్షాలు తమ కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (I-N-D-I-A) అని నామకరణం చేసుకున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో I-N-D-I-A వర్సెస్ ఎన్డీయేగా ఉంటుందని రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశంలో అన్నారు. ఈ సమావేశం తర్వాత రాహుల్, సోనియాలు ఢిల్లీకి బయలుదేరగా, విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.