I-N-D-I-A కూటమిపై బీజేపీ ఘాటు వ్యాఖ్యలు
- రాజకీయ మనుగడ కోసం ఇండియా పేరును అవమానిస్తున్నారని ఆగ్రహం
- ప్రతిపక్షాల కూటమిని తీవ్రవాద సంస్థతో పోల్చిన అమిత్ మాలవీయ
- సిమిని నిషేధించినప్పుడు పేరు మార్చుకొని వస్తుందని వ్యాఖ్య
- పేరు మారినంత మాత్రాన వారి స్వభావం మారదని విమర్శలు
కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తమ కూటమికి I-N-D-I-A అని పేరు పెట్టుకోవడంపై బీజేపీ చురకలు అంటించింది. ప్రతిపక్ష కుటుంబ పార్టీలు తమ వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ పేరును వినియోగించడం దారుణమని బీజేపీ విమర్శలు గుప్పించింది. తమ రాజకీయ మనుగడ కోసం ఇండియా పేరును అవమానిస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జ్ అమిత్ మాలవీయ కూడా విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ... ప్రతిపక్షాల కూటమిని తీవ్రవాద సంస్థతో పోల్చారు. సిమి వంటి ఉగ్రవాద సంస్థను నిషేధించినప్పుడు వేరే పేరు మార్చుకొని ఆ పేరుతో గ్రూప్ సభ్యులు ఒక్కటయ్యేవారని, పేరు మారినంత మాత్రాన వారి స్వభావం మారదని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను ఉద్దేశించి అన్నారు. అవినీతికి, తిరోగమన రాజకీయాలకు యూపీఏ పెట్టింది పేరని, వారు మరోసారి పేరు మార్చుకొని వస్తున్నారని, అంతమాత్రాన విశ్వసనీయత వస్తుందనుకుంటే పొరపాటు అన్నారు. ఇలాంటి వారిని ప్రజలు తరిమి కొడతారన్నారు.