ఎన్డీయే పక్షాల సమావేశం, ప్రధాని మోదీ వెనకే పవన్ కల్యాణ్!
- ఢిల్లీ ది అశోక్ హోటల్‌లో ప్రారంభమైన ఎన్డీయే పక్షాల సమావేశం
- మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రావడమే లక్ష్యంగా 38 పార్టీలతో సమావేశం
- హాజరైన షిండే, చిరాగ్ పాశ్వాన్, పవన్ కల్యాణ్, పళనిస్వామి
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఆధ్వర్యంలో ఎన్డీయే పక్షాల భేటీ మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ది అశోక్ హోటల్‌లో ప్రారంభమైంది. మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రావడమే లక్ష్యంగా 38 పార్టీలతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపు అవశ్యకతను ప్రధాని మోదీ వివరించనున్నారు. తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను, తదుపరి లక్ష్యాలను జేపీ నడ్డా ప్రకటించనున్నారు.
సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రధాని మోదీ సమావేశం జరగనున్న హోటల్ కు వచ్చారు. ఆయనకు జేపీ నడ్డా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తదితరులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ భేటీకి ఏక్ నాథ్ షిండే వర్గం శివసేన, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, అన్నాడీఎంకే నేత పళనిస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ భేటీకి నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్, జేపీ నడ్డా, అమిత్ షా తదితర బీజేపీ నేతలు హాజరయ్యారు.