ఇంకా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని ఢిల్లీ
- ఉత్తరాదిన కుండపోత వానలు
- పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం
- గత కొన్నిరోజులుగా ఢిల్లీలో వరద పరిస్థితులు
- ఎడతెరిపి లేని వర్షాలతో ఉప్పొంగుతున్న యమునా నది
- రేపు కూడా భారీ వర్షాలు పడతాయన్న ఐఎండీ
గత కొన్నిరోజులుగా కుండపోత వానలు, వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు, వరదలు ఇప్పటికీ వీడలేదు. యమునా నది మహోగ్ర రూపం ఇంకా కొనసాగుతూనే ఉంది.
వారం రోజులుగా వరద గుప్పిట్లోనే ఉన్న ఢిల్లీ నగరం.... భారీ వర్షాలు కురుస్తూనే ఉండడంతో ఇప్పట్లో జల దిగ్బంధనం నుంచి బయటపడే పరిస్థితులు కనిపించడంలేదు. దేశ రాజధానిలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. ఐపీ ఫ్లైఓవర్ వద్ద డ్రెయిన్ పొంగిపొర్లుతోంది. దాంతో రాజ్ ఘాట్ నుంచి నిజాముద్దీన్ వరకు మురికినీటితో నిండిపోగా, ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.
మరోవైపు, ఢిల్లీకి ఇంకా వానలు తొలగిపోలేదని, రేపు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. అటు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.