జగన్ 30 లక్షల ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారు: చినరాజప్ప

  • ఇప్పటికే టీడీపీకి చెందిన లక్ష ఓట్లు తొలగించారని ఆరోపణ
  • వాలంటీర్లతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆగ్రహం
  • ఈ సమాచారాన్ని ప్రయివేటు సంస్థలకు ఇస్తున్నారని విమర్శ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రతిపక్షాలకు చెందిన 30 లక్షల ఓట్లను తొలగించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన లక్ష ఓట్లను తొలగించారన్నారు. ఇప్పుడు వాలంటీర్లతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని, ఈ సమాచారాన్ని ప్రయివేటు సంస్థలకు ఇస్తున్నారని ఆరోపించారు. 

ఓటరు పరిశీలనకు వాలంటీర్లను ఉపయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్ల ద్వారా సమాచారం సేకరించే కుట్ర జరుగుతోందన్నారు. జగన్ ఓటు హక్కును కూడా కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా ప్రతిపక్షాల ఓట్ల తొలగింపుకు కుట్ర చేస్తున్నారన్నారు.


More Telugu News