డంపర్ ట్రక్కును ఢీకొట్టి ఇరుక్కుపోయిన కారు.. డ్రైవర్ ఉండగానే రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డంపర్ డ్రైవర్.. వీడియో ఇదిగో!
- కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఘటన
- ట్రక్కును వెనక నుంచి ఢీకొట్టి ఇరుక్కుపోయిన కారు
- వేగం పెంచుతూ దూసుకెళ్లిన డంపర్ డ్రైవర్
- చేజ్ చేసి ట్రక్కును ఆపి కారు డ్రైవర్‌ను రక్షించిన మరో కారు డ్రైవర్
కర్ణాటకలోని ఉదుపిలో దారుణం జరిగింది. సాగర నుంచి మంగళూరు వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న డంపర్ ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు ముందుభాగం డంపర్ వెనక ఇరుక్కుపోయింది. గమనించిన ట్రక్ డ్రైవర్ వాహనాన్ని ఆపాల్సింది పోయి వేగం మరింత పెంచాడు. చిక్కుకున్న కారులో డ్రైవర్ ఉండగానే ట్రక్ డ్రైవర్ దాదాపు రెండు కిలోమీటర్ల పాటు కారును ఈడ్చుకెళ్లాడు.
అదే రూట్‌లో వెళ్తున్న ఓ కారు డ్రైవర్ దీనిని గమనించి ట్రక్‌ను వెంబడిస్తూ డ్రైవర్‌ను ఆపాలని కోరినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో మరింత వేగం పెంచి వాహనానికి కారు అడ్డం పెట్టడంతో ట్రక్ డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. ఆ తర్వాత కారు డ్రైవర్‌ను రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.