ఐకియా స్టోర్‌లో స్నాక్స్ తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక.. క్షమాపణలు చెప్పిన ఫర్నిచర్ సంస్థ
- బెంగళూరులోని ఐకియా స్టోర్‌లో ఘటన
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ట్వీట్
- ఐకియా తీరుపై నెటిజన్ల విమర్శలు
- దర్యాప్తు చేస్తున్నామన్న ఐకియా
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఐకియా స్టోర్‌లో ఓ మహిళకు భయంకరమైన అనుభవం ఎదురైంది. స్టోర్‌లోని ఫుడ్‌కోర్టులో భోజనం చేస్తుండగా ఆమె టేబుల్‌పై పైనుంచి చచ్చిన ఎలుక పడింది. దీంతో అవాక్కైన ఆమె వెంటనే తాను తింటున్న స్నాక్స్ పక్కనే పడివున్న ఎలుక ఫొటోను తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘నా ఫుడ్ టేబుల్‌పై ఏం పడిందో ఊహించండి’ అని దానికి క్యాప్షన్ తగిలించారు. తాము తింటుండగా ఈ ఎలుక పై నుంచి పడిందని పేర్కొన్నారు.
శరణ్య తొలిసారి తన స్నేహితులతో కలిసి నగరంలోని నేలమంగళలోని ఐకియా స్టోర్‌కు వెళ్లారు. షాపింగ్ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఐకియా పుడ్‌కోర్టులో డిజర్ట్స్ కొని టేబుల్ వద్ద కూర్చుని తింటుండగా సీలింగ్ నుంచి ఒక్కసారిగా చచ్చిన ఎలుకపడింది. దీంతో ఒక్కసారిగా వారు షాకయ్యారు. విషయం అక్కడి సిబ్బందికి చెప్పడంతో వారు ఎవరెవరికో ఫోన్ చేశారు కానీ వెంటనే వచ్చి దానిని తీయడం కానీ, కవర్ చేయడం కానీ చేయలేదని శరణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత టేబుల్ మార్చారు తప్పితే శానిటైజ్ కూడా చేయలేదని పేర్కొన్నారు. అక్కడ చాలామంది ఉండడంతో తాను గొడవ చేయాలని అనుకోలేదని సైలెంటుగా బయటకు వచ్చేశామని తెలిపారు.
ఆమె ట్వీట్ వైరల్ వైరల్ కావడం, నెటిజన్లు విమర్శలు కురిపించడంతో స్పందించిన ఐకియా జరగిన ఘటనపై శరణ్యకు క్షమాపణలు తెలిపింది. దీనిపై తాము దర్యాప్తు చేస్తామని, అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. పరిశుభ్రతకు తాము ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.