తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. రేపటి నుంచి అతి భారీ వర్షాలు
- రేపటిలోగా గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం
- ఇప్పటికే దక్షిణ ప్రాంతంపై మరో ఆవర్తనం
- చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
- ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రేపటి (బుధవారం) నుంచి శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై రేపటిలోగా గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఫలితంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.