దేశంలో ఐదేళ్లలో గణనీయంగా తగ్గిన పేదరికం

  • పేదరికం నుండి బయటపడిన 13.5 కోట్ల మంది 
  • పరిగణనలోకి పౌష్టికాహారం, విద్య, శానిటేషన్ తదితర సూచికలు
  • అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ లో 34.4 శాతం తగ్గుదల
2015-16 నుండి 2019-21 మధ్యకాలంలో దేశంలోని పేదల శాతం 24.85% నుండి 14.96%కి తగ్గిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. మొత్తంగా 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడినట్లు నేషనల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ పేరిట విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక కోసం పౌష్టికాహారం, విద్య, శానిటేషన్, సబ్సిడీ వంట ఇంధనం, శిశుమరణలు, తాగునీరు, బ్యాంకు ఖాతాల వంటి పన్నెండు సూచికలను పరిగణలోకి తీసుకున్నారు.

ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ లలో పేదరికం అత్యంత వేగంగా తగ్గుతోందని వెల్లడించింది. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ లో 34.3 శాతం పేదరికం తగ్గిందని, ఆ తర్వాత బీహార్, మధ్యప్రదేశ్ ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని పేదల శాతం 2015-16లో 24.85 శాతం ఉండగా, 2019-21 నాటికి 14.96 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 8.65 శాతం నుండి 5.27 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 32.59 శాతం నుండి 19.28 శాతానికి తగ్గినట్లు తెలిపింది. పేదరికం తీవ్రత 47 శాతం నుండి 44 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది.


More Telugu News