వెంకటేశ్ 'సైంధవ్' నుంచి ఆసక్తికర ఫస్ట్ లుక్ విడుదల

  • శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా సైంధవ్
  • బేబీ సారా లుక్ ను విడుదల చేసిన చిత్రబృందం
  • గాయత్రి అనే పాత్రను పోషిస్తున్న బేబీ సారా
  • చిత్రకథకు కీలక పాత్ర ఇదేనన్న వెంకటేశ్!
  • డిసెంబరు 22న వస్తున్న సైంధవ్
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న కొత్త చిత్రం సైంధవ్ నుంచి ఆసక్తికర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో గాయత్రి అనే పాత్రను పోషిస్తున్న బేబీ సారా లుక్ ను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ చిన్నారి పాప వెంకటేశ్ ను హత్తుకుని ఉండడం ఈ పిక్ లో చూడొచ్చు. "మీట్ ద హార్ట్ ఆఫ్ సైంధవ్" అంటూ బేబీ సారా ఫస్ట్ లుక్ ను హీరో వెంకటేశ్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. తద్వారా ఈ సినిమాలో ఆ చిన్నారి పాత్రే కీలకమని చెప్పేశారు.

శైలేష్ కొలను దర్శకత్వంలో  నీహారిక ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న సైంధవ్ చిత్రం డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆండ్రియా జెర్మియా, శ్రద్ధాదాస్, రుహానీ శర్మ తదితరులు నటిస్తున్నారు.



More Telugu News