మార్కెట్లలో కొనసాగుతున్న రికార్డు ర్యాలీ.. దూసుకుపోయిన సెన్సెక్స్

  • 529 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 147 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2.81 శాతం పెరిగిన ఎస్బీఐ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డు ర్యాలీ కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఆటో, ఫైనాన్స్, రియాల్టీ తదితర సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 529 పాయింట్లు లాభపడి 66,590కి చేరుకుంది. నిఫ్టీ 147 పాయింట్లు పెరిగి 19,711 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.81%), విప్రో (2.54%), రిలయన్స్ (2.10%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.07%), కోటక్ బ్యాంక్ (1.45%). 

టాప్ లూజర్స్:
టాటా మోటర్స్ (-1.02%), భారతి ఎయిర్ టెల్ (-0.89%), టైటాన్ (-0.70%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.66%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.66%).


More Telugu News