'నాయకుడు' కంటెంట్ బలమైనదే .. కానీ..!

  • తమిళనాట హిట్ కొట్టిన 'మామన్నన్'
  • ఉదయనిధి కెరియర్లోనే అత్యధిక వసూళ్లు 
  • ఈ నెల 14వ తేదీన తెలుగులో విడుదల 
  •  ఇక్కడ అంతగా లభించని ఆదరణ
  • ఉదయానిధికి ఇక్కడ క్రేజ్ లేకపోవడమే కారణమనే టాక్  

ఉదయనిధి స్టాలిన్ ... కీర్తి సురేశ్ .. ఫహాద్ ఫాజిల్ .. వడివేలు ప్రధానమైన పాత్రలుగా, తమిళంలో 'మామన్నన్' సినిమా రూపొందింది. సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 29వ తేదీన తమిళనాట విడుదలైంది. ఉదయనిధి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ సినిమాలో టైటిల్ రోల్ ను పోషించింది వడివేలు .. ఆయన ఎమ్మెల్యే గా కనిపిస్తాడు. ఆయన కొడుకు పాత్రను ఉదయనిధి స్టాలిన్ పోషించాడు. ఉదయనిధి పాత్ర మాదిరిగానే ఆదర్శ భావాలు కలిగిన యువతిగా .. అతని లవర్ గా కీర్తి సురేశ్ కనిపిస్తుంది. 'కర్ణన్' సినిమాతో దర్శకుడిగా మరింత క్రేజ్ తెచ్చుకున్న సెల్వరాజ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. 

ధనిక - పేద తారతమ్యం, అధికారం - ఆదర్శం  అనే అంశాల మధ్య నడిచే కథ ఇది. ఈ అంశాలు స్థానిక రాజకీయాలను టచ్ చేస్తూ కొనసాగుతూ ఉంటాయి. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 60 కోట్ల వరకూ వసూలు చేసింది.  ఉదయనిధి కెరియర్లో ఇది అత్యధిక వసూళ్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న తెలుగులోను 'నాయకుడు' టైటిల్ తో రిలీజ్ చేశారు. 

ఉదయానిధికి ఇక్కడ పెద్దగా మార్కెట్ లేకపోయినా, కీర్తి సురేశ్ .. ఫహాద్ ఫాజిల్ .. వడివేలు థియేటర్స్ కి రప్పిస్తారని అనుకున్నారు. కానీ ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. కథ .. కథనం .. పాటల పరంగా తమిళనాట హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను, ఇక్కడి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. 


More Telugu News