నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి 'అశ్విన్స్'

  • సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన 'అశ్విన్స్'
  • జూన్ 23వ తేదీన థియేటర్స్ కి వచ్చిన సినిమా
  • కొంతవరకూ ప్రేక్షకులను భయపెట్టిన కంటెంట్  
  • ఈ నెల 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

'అశ్విన్స్' .. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన సినిమా. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, తరుణ్ తేజ దర్శకత్వం వహించాడు. జూన్ 23వ తేదీన థియేటర్స్ కి ఈ సినిమా వచ్చింది. వసంత్ రవి .. విమలా రామన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది.

'అశ్విన్స్' అనేది అశ్వనీ దేవతలతో ముడిపెట్టిన కథ. లండన్ లోని ఒక పాడుబడిన ప్యాలెస్ లో ఒక ఆత్మ ఉందని తెలుసుకున్న కొంతమంది యూ ట్యూబర్స్ అక్కడికి చేరుకుంటారు. అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది కథ. ఒక రకంగా చెప్పాలంటే హారర్ థ్రిల్లర్ పాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ ఆత్మకీ ... అశ్వనీ దేవతలకి గల సంబంధం ఏమిటనేది ఒక సస్పెన్స్. 

ఈ సినిమా టెక్నీకల్ గా ప్రేక్షకులను కొంతవరకూ భయపెట్టగలిగింది. కానీ కథాకథనాల పరంగా కనెక్ట్ కాలేకపోయింది. ఆత్మకీ .. అశ్వనీదేవతలకి ముడిపెట్టడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. హాలీవుడ్ హారర్ సినిమాల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది చూడాలి. 


More Telugu News