మహిళల హక్కులంటూ గొంతుచించుకుంటున్న ఫేక్ లీడర్లను నమ్మొద్దు: పూనమ్ కౌర్

  • మరోమారు ట్వీట్ తో దుమారం రేపిన హీరోయిన్
  • నకిలీ నాయకులతో జాగ్రత్త అంటూ ఏపీ ప్రజలకు హెచ్చరిక
  • మండిపడుతున్న ప్రముఖ నటుడి అభిమానులు
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాలతో పాటు రాజకీయాలపైనా స్పందించే హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల పూనమ్ కౌర్ చేస్తున్న ట్వీట్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. పూనమ్ చేస్తున్న విమర్శలు తమ నాయకుడిని ఉద్దేశించినవేనని కొంతమంది అభిమానులు ఆమెకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం పూనమ్ కౌర్ మరో వివాదాస్పద ట్వీట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో మహిళల హక్కులపై గొంతుచించుకుంటున్న నకిలీ నాయకులను నమ్మొద్దని తన ట్వీట్ ద్వారా ప్రజలను హెచ్చరించింది.

రాష్ట్రంలో ఈ ఫేక్ లీడర్లు మహిళలకు హక్కులంటూ లేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారని పూనమ్ మండిపడ్డారు. అంతగా అభిమానమే ఉంటే ఢిల్లీలో మొన్నటి వరకు ఆందోళన చేసిన రెజ్లర్లకు మద్ధతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదేమని నిలదీశారు. తమ సొంత ప్రయోజనాల కోసమే ఏపీలోని నకిలీ లీడర్లు మహిళలపై అభిమానాన్ని, ప్రేమను కురిపిస్తున్నారని విమర్శించారు. ఈ పోస్టు చూసిన పవన్ కల్యాణ్ అభిమానులు జనసేనానిని ఉద్దేశించే పూనమ్ కౌర్ ఈ పోస్ట్ పెట్టిందని మండిపడుతున్నారు. మరోమారు ఇలాంటి ట్వీట్లు చేస్తే ఏం జరుగుతుందో మీ ఊహకు కూడా అందదని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.


More Telugu News