అమెరికాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక అవార్డు
- గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు అందుకున్న
కిషన్ రెడ్డి - భారత సంస్కృతి, పర్యాటక అభివృద్ధికి చేసి కృషికి గుర్తింపు
- ఈ మధ్యే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. అమెరికా పర్యటనలో ఉన్న ఆయనకు గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు లభించింది. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్స్ టు పీపుల్స్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే యూఎస్ ఇండియా ఎస్‌ఎంఈ కౌన్సిల్ కిషన్‌రెడ్డికి ఈ అవార్డును ప్రకటించింది. భారతదేశపు సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు పర్యాటకాభివృద్ధికి చేసిన కృషికి గానూ అవార్డుతో గౌరవించింది.
అమెరికాలోని మేరీలాండ్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఆయనకు ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డు పట్ల కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో దేశంలో ఘనమైన చరిత్రను, సంస్కృతిని కాపాడుకునేందుకు పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దానికి గుర్తింపుగానే ఈ అవార్డు దక్కిందని అన్నారు. కాగా, బండి సంజయ్ స్థానంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.