ప్రభుత్వాధికారి బదిలీ..ఫేర్‌వెల్ పార్టీలో బార్ డ్యాన్సర్ నృత్యం.. వీడియో ఇదిగో!

  • బీహార్‌లోని ఖగారియా జిల్లాలో జరిగిన ఘటన
  • బ్లాక్ డెవలెప్‌మెంటల్ ఆఫీసర్‌ బదిలీ
  • ఆయన కోసం ఏర్పాటు చేసిన ఫేర్‌వెల్ పార్టీలో బార్ డ్యాన్సర్ నృత్యం
  • నెట్టింట వీడియో వైరల్, అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
  • ఘటనపై దర్యాప్తునకు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశం
బీహార్‌లో బదిలీపై వెళుతున్న ఓ ప్రభుత్వాధికారికి ఇచ్చిన ఫేర్‌వెల్ పార్టీలో బార్‌ డ్యాన్సర్ నృత్యం చేయడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఖగారియా జిల్లాలోని బ్లాక్ డెవలప్‌మెంటల్ ఆఫీసర్(బీడీఓ) సునీల్ కుమార్‌కు బదిలీ కావడంతో ఈ ఫేర్‌వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో ఓ బార్ డ్యాన్సర్ స్టేజీపై అభ్యంతరక పోజుల్లో నృత్యం చేసింది. అంతేకాకుండా, అక్కడి వారు ఆమెపై నోట్లు వెదజల్లినట్టు వెల్లడైంది.

ఈ పార్టీలో ప్రభుత్వాధికారులు అనేక మంది పాల్గొన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార యంత్రాంగానికి ఈ ఘటనతో తలవంపులు రావడంతో జిల్లా మెజిస్ట్రేట్ రంగంలోకి దిగారు. ఫేర్‌వేల్ పార్టీ ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరెవరు పాల్నొన్నారనే విషయాలను వెలికితీసేందుకు దర్యాప్తునకు ఆదేశించారు.


More Telugu News