తమిళనాడులో మళ్లీ ఈడీ కలకలం.. మరో మంత్రి ఆస్తులపై దాడులు
- ఇటీవల సెంథిల్ బాలాజీ ఆస్తులపై ఈడీ దాడులు
- నేడు పొన్ముడి, ఆయన కుమారుడి ఇళ్లపై దాడులు చేపట్టిన ఈడీ అధికారులు
- మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి
తమిళనాడులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి వి. సెంథిల్‌బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. తాజాగా మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడి ఇళ్లపై ఈ ఉదయం అధికారులు దాడులు చేశారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి అయిన పొన్ముడిపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలోనే దాడులు జరిగినట్టు తెలుస్తోంది.
అవినీతి కేసులో పొన్ముడిపై విచారణను నిలిపివేసేందుకు గత నెలలో హైకోర్టు నిరాకరించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమారుడు గౌతమ్ సిగమణి కూడా విచారణపై స్టే విధించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు, ఈడీ దాడులతో తమిళనాడులో మళ్లీ కలకలం రేగింది.