ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి జిల్లాల పర్యటన ఖరారు
- ఇటీవల ఏపీ బీజేపీ పగ్గాలందుకున్న పురందేశ్వరి
- రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి
- వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణుల సమాయత్తం
ఇటీవలే ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన పురందేశ్వరి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. అందుకే విస్తృతస్థాయిలో జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పురందేశ్వరి జిల్లాల పర్యటన ఖరారైంది.
ఈ నెల 23న ప్రొద్దుటూరులో రాయలసీమ నేతలతో పురందేశ్వరి సమావేశం కానున్నారు. ఈ నెల 25న గుంటూరులో కోస్తా జిల్లాల నేతలతో భేటీ అవనున్నారు. ఈ నెల 26న రాజమండ్రిలో గోదావరి జిల్లాల నేతలను కలుసుకోనున్నారు. ఈ నెల 27న విశాఖలో ఉత్తరాంధ్ర నేతలతో పురందేశ్వరి సమావేశం జరపనున్నారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ శ్రేణులను ఇప్పటినుంచే సమాయత్తం చేయాలని పురందేశ్వరి భావిస్తున్నారు.