రామచంద్రాపురం నుంచే పోటీ చేస్తా... ఆ విషయం జగన్ కూడా చెప్పారు: మంత్రి వేణుగోపాలకృష్ణ

  • రామచంద్రాపురంలో అసమ్మతి అంటూ వార్తలు
  • పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ మంత్రి వేణుగోపాలకృష్ణ అంటూ ప్రచారం
  • నియోజకవర్గంలో అసమ్మతి లేదన్న వేణుగోపాలకృష్ణ
రామచంద్రాపురం నియోజకవర్గంలో అసమ్మతి అంటూ వస్తున్న వార్తలపై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో అసమ్మతి లేదని స్పష్టం చేశారు. ఏమైనా జరిగుంటే ఆ పరిణామాలన్నీ కృష్ణార్పణం అనేదే నా సమాధానం అని వెల్లడించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ తనకు గురువు అని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచే పోటీ చేస్తానని, ఆ విషయం సీఎం జగన్ కూడా చెప్పారని వివరించారు. 

మంత్రి వేణుగోపాలకృష్ణ ఇవాళ నిర్వహించిన బీసీ గర్జన సభలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదరికమే బీసీలకు పెద్ద రోగమని అన్నారు. సుదీర్ఘ పేదరికం వల్ల రెండు మూడు తరాలు కష్టాలు ఎదుర్కొన్నాయని వివరించారు. 

బీసీల పరిస్థితిపై సమగ్ర సర్వే కోసం మొట్టమొదటిసారిగా ఏపీలోనే ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. బీసీలకు ఏం కావాలో గుర్తించి, ఆ దిశగా పథకాలు అందిస్తున్న ప్రభుత్వం తమదేనని మంత్రి ఉద్ఘాటించారు.


More Telugu News