చైనాలో ఆసియా క్రీడలు.... భారత క్రికెట్ జట్ల ఎంపిక
- ఈ ఏడాది ఆసియా క్రీడలకు ఆతిథ్యమిస్తున్న హాంగ్జౌ నగరం
- సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు ఆసియా క్రీడలు
- సెప్టెంబరు 28 నుంచి క్రికెట్ పోటీలు
- టీమిండియా పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేసిన బీసీసీఐ
- యువ క్రికెటర్లకు పెద్దపీట
క్రికెట్ ను మరింత విస్తృతం చేసే క్రమంలో ఆసియా క్రీడల్లోనూ క్రికెట్ కు స్థానం కల్పిస్తుండడం తెలిసిందే. తాజాగా చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్ లో క్రికెట్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఈ ఏడాది ఏషియన్ గేమ్స్ చైనాలోని హాంగ్జౌ నగరంలో సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు జరగనున్నాయి. ఇందులో క్రికెట్ ఈవెంట్ సెప్టెంబరు 28 నుంచి నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే పురుషుల, మహిళల భారత క్రికెట్ జట్లను శనివారం రాత్రి ఎంపిక చేశారు.
పురుషుల క్రికెట్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, శివం దూబే, జితేశ్ శర్మలను ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపిక చేశారు. అక్టోబరు 5 నుంచి భారత్ లో వరల్డ్ కప్ జరగనున్నందున సీనియర్ ఆటగాళ్లెవరినీ ఆసియా క్రీడలకు ఎంపిక చేయలేదు.
ఇక టీమిండియా మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. ఈ టీమ్ లో తెలుగమ్మాయిలు అంజలి శర్వాణి, బారెడ్డి అనూష చోటు దక్కించుకున్నారు.
టీమిండియా పురుషుల జట్టు
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముఖేశ్ కుమార్, శివమ్ మావి, ప్రభ్ సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్).
టీమిండియా మహిళల జట్టు
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్ జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శర్వాణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కణిక అహూజా, ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్), బారెడ్డి అనూష.