గౌతమ్ సినిమాల్లోకి వస్తాడు: నమ్రత
- చదువు పూర్తయ్యాక తెరంగేట్రం చేస్తాడని చెప్పిన మహేశ్ భార్య
- '1 నేనొక్కడే' చిత్రంలో నటించిన గౌతమ్
- వాణిజ్య ప్రకటనలో సొంతంగా నటించిన సితార
సినీ పరిశ్రమలో వారసుల సంప్రదాయం అన్ని చోట్లా ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా వారసులుగా వచ్చిన హీరోలు, హీరోయిన్లు సత్తా చాటుతున్నారు. టాలీవుడ్ లో దివంగత కృష్ణ నట వారసుడిగా వచ్చిన మహేశ్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగారు. తెలుగులో అగ్ర నటుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు గౌతమ్ అరంగేట్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘1 నేనొక్కడినే’ సినిమాలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ కు నటనపై ఆసక్తి ఉంది. దాంతో, తను హీరోగా ఎంట్రీ ఇవ్వాలని మహేశ్ అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ విషయంపై మహేశ్ భార్య నమ్రత స్పందించారు. ప్రస్తుతం గౌతమ్ దృష్టి చదువుపైనే ఉందన్నారు. ఇంకో ఆరేడు సంవత్సరాల తర్వాతే సినిమాల్లోకి వస్తాడని చెప్పారు. మరోవైపు మహేశ్ గారాలపట్టి సితార కూడా నటనపై ఆసక్తి పెంచుకుంది. తనకు సినిమాలంటే ఇష్టమని చెప్పింది. ఆమె ఇప్పటికే వాణిజ్య ప్రకటనలో నటించింది. దానికి గాను వచ్చిన మొత్తం పాతితోషికాన్ని ఛారిటీ కోసం ఖర్చు చేసినట్టు తెలిపింది.