హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైన లాల్ దర్వాజ బోనాల జాతర
- అమ్మవారి సన్నిధికి పోటెత్తిన భక్తులు
- కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
- బోనాలు జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ లో లాల్ దర్వాజ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. లాల్ దర్వాజ భక్తజన సంద్రంగా మారింది. సింహవాహిని మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, సౌత్ జోన్ పరిధిలో 400 సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు. బోనాలు జరగనున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆలయ అధికారులు అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు.