రాజకీయాల్లోకి రానున్న అభిషేక్ బచ్చన్?
- ఎస్పీ తరపున ప్రయాగ్‌రాజ్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు వార్త హల్‌చల్
- గతంలో ప్రయాగ్‌రాజ్ ఎంపీగా కాంగ్రెస్ తరపున భారీ మెజారిటీతో గెలిచిన తండ్రి అమితాబ్
- ఎస్పీ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న తల్లి జయాబచ్చన్
- అభిషేక్‌నూ రంగంలోకి దింపాలని ఎస్పీ పెద్దల యోచన
ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయనున్నట్టు సీనీరాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తన తల్లి, తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రయాగ్‌రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయనున్నారని సమాచారం. అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ 1984లో ఇదే స్థానం నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు బరిలోకి దిగిన ఆయన లోక్‌దళ్ అభ్యర్థి హెచ్ఎన్ బహుగుణపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఇక అభిషేక్ తల్లి, సమాజ్‌వాదీ పార్టీ నేత జయాబచ్చన్ ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. దీంతో, అభిషేక్‌ను కూడా రంగంలోకి దింపాలని ఎస్పీ అగ్రనేతలు తలపోస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక అభిషేక్ తల్లి, సమాజ్‌వాదీ పార్టీ నేత జయాబచ్చన్ ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. దీంతో, అభిషేక్‌ను కూడా రంగంలోకి దింపాలని ఎస్పీ అగ్రనేతలు తలపోస్తున్నట్టు తెలుస్తోంది.