జనసేన నేతపై చేయి చేసుకున్న సీఐ అంజుయాదవ్‌కు ఛార్జ్ మెమో జారీ!

  • నెట్టింట వైరల్ గా మారిన జనసైనికుడిపై చేయి చేసుకున్న వీడియో
  • విచారణ జరిపి డీజీపీకి నివేదిక సమర్పించిన తిరుపతి ఎస్పీ
  • సీఐపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం
శ్రీకాళహస్తిలో జనసేన నేత సాయిపై చేయి చేసుకున్న పట్టణ సీఐ అంజు యాదవ్ కు ఛార్జ్ మెమో జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం తిరుపతి వెళ్లి జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ పార్టీ నేతపై సీఐ తీరును జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. సీఐపై చర్యలు తీసుకోవాలని సోమవారం తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. 

అయితే ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి విచారణ జరిపి, డీజీపీకి నివేదికను సమర్పించారు. ఈ నేపథ్యంలో త్వరలో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

హెచ్చార్సీ ఆగ్రహం!

ఇదిలా ఉండగా, అంజు యాదవ్‌కు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు స్టేషన్ ఆఫీసర్, తిరుపతి డీఎస్పీ, తిరుపతి ఎస్పీ, అనంతపురం డీఐజీ, తిరుపతి కలెక్టర్, డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. విచారణ జరిపి ఈ నెల 27న నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News