68% మంది టమాటా వినియోగాన్ని తగ్గించారు.. 14% మంది కొనడమే మానేశారు: తాజా సర్వేలో వెల్లడి
- కొన్ని రోజుల్లోనే 300 శాతం పెరిగిన టమాటా ధరలు
- మున్ముందు టమాటా రూ.300కు పెరిగే అవకాశం
- జూన్ 24న రూ.20గా ఉన్న టమాటా.. ఇప్పుడు రూ.220కి చేరుకుంది
టమాటా ధరలు 300 శాతానికి పైగా పెరగడంతో దాదాపు 68 శాతం కుటుంబాలు తమ వంటకంలో ఈ కూరగాయ వినియోగాన్ని తగ్గించాయి. మరో 14 శాతం మంది అయితే దీనిని వినియోగించడమే మానివేశారు. ఈ మేరకు లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది.
ఈ వెబ్‌సైట్ సర్వే నివేదిక ప్రకారం.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు, సరిపడా జల్లుల కారణంగా టమాటా ధరలు మరింత పెరిగే అవకాశముందని, రానున్నవారాల్లో కిలో రూ.300కు చేరుకోవచ్చునని తేలింది.
గత మూడు వారాల్లో రిటైల్ మార్కెట్‌లలోనే కాకుండా హోల్‌సేల్ మార్కెట్‌లలో కూడా టమాటా ధరలు నగరాల్లో భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. ఢిల్లీలో జూన్ 24న కిలో రూ.20 నుండి 30 ఉండగా, ఆ తర్వాత రూ.180కి, ఇప్పుడు నాణ్యమైన టమాటా ధర రూ.220కి చేరుకుంది.