పోలవరం ప్రాజెక్టుపై దేవినేని ఉమ ప్రశ్నల వర్షం
- ప్రాజెక్టును గాలికి వదిలేసి జగన్ జాతి ద్రోహానికి పాల్పడ్డాడన్న మాజీ మంత్రి
- జగన్ రెడ్డిని వెనకేసుకొస్తూ అంబటి మీడియాపై విషం కక్కుతున్నాడని ఆగ్రహం
- ప్రాజెక్టు ప్రాంతంలో మీడియాను, ప్రతిపక్షాలను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్న
పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టును గాలికి వదిలేసి ముఖ్యమంత్రి జగన్ జాతి ద్రోహానికి పాల్పడ్డారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ రెడ్డిని వెనకేసుకొస్తూ మంత్రి అంబటి రాంబాబు మీడియాపై విషం కక్కుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మీడియాను, ప్రతిపక్షాలను ఎందుకు అనుమతించడం లేదని నిలదీశారు.
పోలవరంలో గైడ్ బండ్ ఎందుకు కుంగింది? డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మాటేమిటి? లైడార్ సర్వేపై మంత్రి ఎందుకు మాట్లాడం లేదు? అని ప్రశ్నించారు. సర్వే రిపోర్టులు అన్నీ తొక్కిపెట్టి పోలవరం నిర్వాసితుల్ని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. కాపర్ డ్యామ్ భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. గోదావరి వరద ముంచుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.