వాలంటీర్ వ్యవస్థను దేశమంతా ప్రశంసిస్తోంది: వైవీ సుబ్బారెడ్డి

  • చంద్రబాబు, పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శ
  • ప్రధాని మోదీ కూడా వాలంటీర్ వ్యవస్థను కొనియాడారని వెల్లడి
  • జన్మభూమి కమిటీలలా దోచుకోవడం లేదని చురక
వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... వాలంటీర్ వ్యవస్థను దేశమంతా ప్రశంసిస్తోందన్నారు. నీతి అయోగ్ సమావేశంలోను వాలంటీర్లను అభినందించారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ వ్యవస్థను కొనియాడారన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా వాలంటీర్లు పారదర్శకంగా పనిచేస్తున్నారని చెప్పారు.

తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు ఉండేవని, వారు దోచుకున్నారని ఆరోపించారు. కానీ వాలంటీర్లు జన్మభూమి కమిటీల్లా దోపిడీలకు పాల్పడటం లేదన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించారన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ మేరకే వాలంటీర్లపైనా, సీఎం జగన్‌పైనా పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని పవన్ ప్రకటించాలని మరో వైసీపీ నేతశిల్పాచక్రపాణి రెడ్డి సవాల్ చేశారు.


More Telugu News