చంద్రబాబును వదిలేస్తేనే పవన్ కు రాజకీయ భవిష్యత్తు: మంత్రి కొట్టు సత్యనారాయణ
- వివాహ వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి పవన్ అంటూ మంత్రి కొట్టు విమర్శ
- హిందూ ధర్మాన్ని పాటించలేని వ్యక్తి అని మండిపాటు
- చంద్రబాబు అనే శనిని నెత్తి మీద పెట్టుకున్నాడని ఎద్దేవా
హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. హిందూ సంస్కృతి గురించి పవన్ కు ఏం తెలుసని ప్రశ్నించారు. రోజురోజుకు పవన్ దిగజారి పోతున్నారని విమర్శించారు. హిందూ ధర్మాన్ని కూడా పాటించలేని వ్యక్తి అని దుయ్యబట్టారు. అన్నవరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోందని, దళారీ వ్యవస్థకు తావు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. వివాహ వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి అని అన్నారు.
ఆర్థిక స్తోమత ఉన్నవారు కూడా స్వామి వారి మీద ఉన్న భక్తితో తమ పిల్లలకు అన్నవరంలో వివాహాలు చేయిస్తారని చెప్పారు. ఆలయంలో జరిగే పెళ్లిళ్లకు ఆలయ నిర్వాహకులు బాధ్యులు కారని... వివాహాలు జరుగుతున్న తీరును క్రమబద్దీకరించామని అన్నారు. చంద్రబాబు లాంటి శనిని నెత్తి మీద పెట్టుకుని పవన్ ఊరేగుతున్నారని కొట్టు అన్నారు. చంద్రబాబును వదిలేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ప్రజల అన్ని అవసరాలను తీరుస్తున్న సీఎం జగన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. గత ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని కూడా పవన్ కాపాడుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.