కోనసీమలో అదుపులోకి రాని మంటలు!

  • కోనసీమ జిల్లా శివకోటిలో బోరు లోంచి గ్యాస్‌, అగ్నికీలలు
  • 20 అడుగుల మేర ఎగసిపడుతున్న మంటలు
  • ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • మంటలకు గ్యాస్‌ పైప్‌లైన్‌ కారణం కాదన్న ఓఎన్‌జీసీ
కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటిలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరు లోంచి గ్యాస్‌, అగ్నికీలలు కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు 20 అడుగుల మేర ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఓఎన్‌జీసీ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బందితో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రాలేదు.

మరోవైపు మంటలు రావడానికి గ్యాస్‌ పైప్‌లైన్‌ కారణం కాదని, అక్కడ అసలు పైప్‌లైనే లేదని ఓఎన్‌జీసీ సిబ్బంది వెల్లడించారు. భూమి పొరల్లో గ్యాస్‌, నీరు ద్వారానే మంటలొచ్చాయని చెప్పారు. బోరును మరింత లోతుకు తవ్వడం వల్లే అగ్నికీలలు ఎగసిపడ్డాయని పేర్కొన్నారు. నరసాపురం నుంచి ప్రత్యేక బృందం వస్తోందని, వారు వచ్చాకే మంటల్ని అదుపు చేయడం సాధ్యపడుతుందని అన్నారు. అయితే బోరుబావి సమీపంలోనే ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఉందని స్థానికులు చెబుతున్నారు.


More Telugu News