శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయం
- వివాదాస్పద సీఐగా గుర్తింపు తెచ్చుకున్న అంజూ యాదవ్
- ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ధర్నా
- జనసేన నేత సాయి చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజూ యాదవ్
- ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పవన్ కల్యాణ్
- సోమవారం నాడు తిరుపతి రానున్న జనసేనాని
తన చర్యలతో పలుమార్లు వివాదాస్పదమైన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ఇటీవల జనసేన నేత సాయి చెంప చెళ్లుమనిపించడం తెలిసిందే. ఈ విషయాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. పవన్ సోమవారం నాడు తిరుపతి రానున్నారు.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేయనున్నారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించనున్నారు.
పవన్ పై వైసీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ కొన్నిరోజుల కిందట శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు పెళ్లిమండపం జంక్షన్ లో ధర్నాకు దిగారు. జనసేన కార్యకర్తలు సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగానే జనసేన నేత సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు.