వివాదంలో చిక్కుకున్న హీరో సాయి ధరమ్ తేజ్
- శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సాయితేజ్ పూజలు
- స్వామికి హారతి ఇచ్చిన సాయితేజ్
- నియమాల ప్రకారం హారతి ఇవ్వాల్సింది అర్చకులే
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సాయితేజ్ పూజలు చేశాడు. ఈ సందర్భంగా స్వామికి ఆయనే నేరుగా హారతి ఇచ్చాడు. ఈ విషయం వివాదాస్పదమయింది. నియమాల ప్రకారం ఆలయ అర్చకులు మాత్రమే దేవుడికి హారతులు ఇస్తారు. ఈ నేపథ్యంలో స్వామికి హారతి ఇచ్చిన సాయితేజ్ పై పండితులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడికి హారతి ఇవ్వడానికి ఆయనకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.