అబుదాబికి చేరుకున్న ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన కింగ్ షేక్ ఖలీద్

  • ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అబుదాబిలో అడుగుపెట్టిన మోదీ
  • యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జయేద్ తో భేటీ
  • ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ, డిఫెన్స్ అంశాలపై ప్రధానంగా చర్చ
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ యూఏఈలో అడుగుపెట్టారు. అబుదాబి విమానాశ్రయంలో ఆయనకు యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ, ఢిఫెన్స్ రంగాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. యూఏఈలో ఎక్కువగా భారతీయులే ఉన్నారు. మొత్తం జనాభాలో 30 శాతం మనవాళ్లే నివసిస్తున్నారు. 



More Telugu News