ఆసియా క్రీడలలో పాల్గొనే భారత జట్టులో అంతా కుర్రాళ్లే!
- రుతురాజ్ కెప్టెన్సీలో జట్టు ప్రకటన
- తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మలకు చోటు
- మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ సారథ్యం
ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. పురుషుల జట్టుకు యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన హైదరాబాద్ యంగ్‌స్టర్ తిలక్ వర్మకు ఈ జట్టులోనూ చోటు దక్కింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో భాగంగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు క్రికెట్ పోటీలు జరుగుతాయి.
అదే సమయంలో ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ మొత్తం యువకులతో ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేష్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్ తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నారు. మరోవైపు సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు జరిగే మహిళల టీ20 పోటీలకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో రెగ్యులర్ జట్టునే ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొన్న టీమ్‌దే దాదాపు కొనసాగించింది. ఇందులో ఏపీ అమ్మాయిలు అంజలి శర్వాణి, అనూషా బారెడ్డికి చోటు లభించింది.
భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్); స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.
భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), అమన్ జోత్ కౌర్, దేవిక వైద్య, అంజలి శర్వాణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రీ (కీపర్), అనూషా బారెడ్డి; స్టాండ్‌బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్.