అశోక్ గజపతిరాజుకు స్వాగతం పలికి చిక్కుల్లో పడ్డ ఆరుగురు అర్చకులు
- రామతీర్థంకు వెళ్లిన అశోక్ కు పూర్ణకలశంతో స్వాగతం పలికిన అర్చకులు
- అర్చకులకు షోకాజ్ నోటీసులు పంపిన ఆలయ ఈవో
- పూజారులపై ప్రతాపం ఏమిటని టీడీపీ మండిపాటు
విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయానికి అనువంశిక ధర్మకర్తగా టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నారనే సంగతి తెలిసిందే. టీడీపీ చేపట్టిన భవిష్యత్ కు గ్యారంటీ బస్సు యాత్రలో భాగంగా తాజాగా ఆయన రామతీర్థంకు వెళ్లారు. రామతీర్థం కూడలిలో అశోక్ కు ఆరుగురు ఆలయ అర్చకులు పూర్ణకలశంతో స్వాగతం పలికారు. ఆయనకు ఆశీర్వచనాలు అందించారు.
ఈ విషయాన్ని ఆలయ ఈవో కిశోర్ కుమార్ తప్పుపట్టారు. ఆరుగురు అర్చకులకు షోకాజ్ నోటీసులు పంపారు. అశోక్ కు ఎందుకు స్వాగతం పలికారో వివరణ ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు. మరోవైపు ఈవో చర్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ నేతలకు దమ్ముంటే తమతో పోరాడాలని... పూజలు చేసే పూజారుల మీద మీ ప్రతాపం ఏమిటని విరుచుకుపడ్డాయి. ఆలయ ఈవో వైసీపీ నేత మాదిరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి.