భారత్ లో టమాటా ధరల మంట.. నేపాల్ రైతులకు కాసుల పంట!

  • టమాటా కోసం నేపాల్ మార్కెట్లకు వెళ్తున్న యూపీ సరిహద్దు జిల్లాల ప్రజలు
  • నేపాల్ లో కిలో టమాటా రూ. 60 - 70 మాత్రమే
  • మన అవసరాలను దృష్టిలో పెట్టుకుని టమాటా పండిస్తున్న నేపాల్ రైతులు
దేశంలో టమాటా ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. ప్రతి వంటకంలో టమాటాలు వేసుకోవడం మనకు అలవాటు. టమాటా లేకుండా మన వంటకాలు పూర్తికావు. అయినప్పటికీ పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న సామాన్యులు... వాటి వినియోగాన్ని చాలా మటుకు తగ్గించేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ సరిహద్దు జిల్లాల ప్రజలు టమాటా కొనడం కోసం నేపాల్ మార్కెట్లకు వెళ్తున్నారు. 

యూపీలో పలు ప్రాంతాల్లో కిలో టమాటా రూ. 130 వరకు ఉంది. నేపాల్ లో మన కరెన్సీలో రూ. 60 నుంచి రూ. 70 మధ్యలో ఉంది. దీంతో యూపీ సరిహద్దు జిల్లాల ప్రజలు పక్కనున్న నేపాల్ మార్కెట్లకు క్యూ కడుతున్నారు. భారత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నేపాల్ రైతులు టమాటా పండిస్తున్నారు. రుతుపవనాల కాలంలో మన దేశంలో కూరగాయల ధరలకు రెక్కలొస్తాయి. ఈ క్రమంలో ఈ సమయంలో అక్కడి రైతులు కూరగాయలు పండించేలా నేపాల్ ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో కూరగాయలు పండిస్తున్న నేపాల్ రైతులకు బాగా గిట్టుబాటు అవుతోంది.


More Telugu News