భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్ ఇదే
- దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు ట్వంటీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌లు
- డిసెంబర్ 10న ట్వంటీ 20తో పర్యటన ప్రారంభం
- వచ్చే ఏడాది జనవరి 3 నుండి 7 మధ్య రెండో టెస్ట్‌తో ముగింపు
డిసెంబర్-జనవరిలో దక్షిణాఫ్రికాలో జరగనున్న టీమిండియా షెడ్యూల్ ఖరారైంది. ఐసీసీ ప్రపంచ కప్ 2023 తర్వాత భారత జట్టుకు ఇది కీలక సిరీస్. ఈ పర్యటనలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు ట్వంటీ 20లు, మూడు వన్డేలు, ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా రెండు టెస్టులు జరగనున్నాయి.
డిసెంబర్ 10 డర్బన్ లో, 12న గెబెర్హాలో, 14న జోహెన్నస్‌బర్గ్‌లో మూడు ట్వంటీ 20 మ్యాచ్ లు జరగనున్నాయి. డిసెంబర్ 17న జోహెన్నస్‌బర్గ్ లో, 19న గెబెర్హాలో, 21న పార్ల్ లో మూడు వన్డేలు జరుగుతాయి. ఆ తర్వాత డిసెంబర్ 26 నుండి 30 వరకు తొలి టెస్ట్, వచ్చే ఏడాది జనవరి 3 నుండి 7వ తేదీ వరకు రెండో టెస్ట్ జరగనున్నాయి.