చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. 66 వేల పాయింట్ల పైన ముగిసిన సెన్సెక్స్

  • 502 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 151 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా పెరిగిన టీసీఎస్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్రను సృష్టించాయి. సెన్సెక్స్ తొలిసారి 66 వేల పాయింట్లకు పైగా ముగిసింది. విదేశీ ఇన్వెస్ట్ మెంట్లు వెల్లువెత్తుతుండటంతో మన మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 502 పాయింట్లు లాభపడి 66,061కి ఎగబాకింది. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 19,565కు చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (5.13%), టెక్ మహీంద్రా (4.51%), ఇన్ఫోసిస్ (4.40%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.58%), విప్రో (2.69%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-1.28%), పవర్ గ్రిడ్ (-1.25%), టైటాన్ (-0.97%), మారుతి (-0.51%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.42%).    



More Telugu News