ఇకపై ఫ్రాన్స్ లోనూ భారత యూపీఐ సేవలు

  • ఇరు దేశాల మధ్య కుదిరిన అంగీకారం
  • వెల్లడించిన భారత ప్రధాని మోదీ
  • ఫ్రాన్స్ వెళ్లే భారత పర్యాటకులకు ఉపయోగకరం
ఫ్రాన్స్ వెళ్లే భారత పర్యాటకులకు శుభవార్త. మన దేశంలో విజయవంతమైన తక్షణ చెల్లింపుల విధానం యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలను ఫ్రాన్స్‌ లో కూడా వినియోగించుకునే అవకాశం వారికి లభించనుంది. ఇకపై భారతీయ కరెన్సీలో తమ మొబైల్ అప్లికేషన్‌ ద్వారా ఫ్రాన్స్‌ లో చెల్లింపులు జరపడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఫ్రాన్స్‌ లో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వివరాలను వెల్లడించారు. భారత దేశ యూపీఐ మార్కెట్ విస్తరణకు గొప్ప ఊపు వచ్చిందని చెప్పారు. ఫ్రాన్స్ లో యూపీఐ సేవల సదుపాయం ఈఫిల్ టవర్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఇక, ఫ్రాన్స్ లో చదువుతున్న భారత విద్యార్థులు తమ విద్యాభ్యాసం అనంతరం అక్కడే ఐదేళ్లపాటు పని చేసే అవకాశం కల్పిస్తూ వర్క్ వీసాల జారీకి కూడా ఒప్పందం కుదిరింది.


More Telugu News