జపాన్ పై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం
- తయారీ రంగంలో ప్రపంచానికి ఆ దేశం ఆదర్శమని వ్యాఖ్య
- రంగారెడ్డి జిల్లాలో జపాన్ కు చెందిన రెండు కంపెనీలకు శంకుస్థాపన
- భవిష్యత్‌లో మరిన్ని జపాన్ కంపెనీలు రాష్ట్రానికి వస్తాయన్న కేటీఆర్
జపాన్ పై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. తయారీ రంగంలో ప్రపంచానికి జపాన్ ఆదర్శమన్నారు. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా చందన్ వెల్లిలో డైఫకు ఇంట్రా లాజిస్టిక్స్, నికోమక్ తైకిష కంపెనీలకు మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా జపాన్ సత్తా చాటిందన్నారు. మన దేశంలో ప్రతి ఇంట్లో ఆ దేశానికి చెందిన వస్తువు ఏదో ఒకటి ఉంటుందని కేటీఆర్ చెప్పారు. భవిష్యత్‌లో ఆ దేశానికి చెందిన మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తున్నామన్నారు.
జపాన్ కంపెనీల కోసం అవసరం అయితే అక్కడ ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జపాన్ కంపెనీల కచ్చితత్వం, పనితీరుకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్దిష్ట సమయంలో ఈ రెండు కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఇక మీదట కూడా ప్రభుత్వం ఇదేతీరుతో పని చేస్తుందని హామీ ఇచ్చారు. కాగా, దాదాపు 576 కోట్ల రూపాయిల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ రెండు కంపెనీల ద్వారా వందలాది మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు.